కేవలం 10రూపాయలకే ముఖం చందమామలా మెరిసిపోతుంది!

అమ్మాయిలు ముఖ చర్మం మెరిసిపోవడానికి ఎన్ని మార్కెట్ ఉత్పత్తులు వినియోగిస్తారో లెక్కపెట్టడం కష్టం. కానీ విచారించాల్సిన విషయం ఏమిటంటే..ఎన్ని వాడినా  చర్మం అలాగే కనిపిస్తుంది. టీనేజ్ అమ్మాయిల్లా చర్మం మిల్కీగా, ముడతలు లేకుండా, మెరుస్తూ ఉండాలనేదే అమ్మాయిల ఆరాటం అంతా. అయితే దీనికోసం వందలు, వేలు ఖర్చు పెట్టి బ్యూటీ ప్రోడక్ట్స్ కొని వాడక్కర్లేదు. కేవలం 10రూపాయల ఖర్చుతో అద్భుతం చేయవచ్చు.  ఈ టిప్ ఫాలో అయితే ముఖం మీద ముడుతలు, మచ్చలు, మొటిమల తాలూకు గుంతలు అన్నీ మాయమైపోతాయి. ఇంతకూ అంత మ్యాజిక్ చేసే టిప్ ఏంటి? దీన్నెలా ఉపోయోగించాలి తెలుసుకుంటే..

ఇప్పటికాలంలో బ్యూటీ టిప్స్ ఫాలో అయ్యే అమ్మాయిలందరికీ విటమిన్-ఇ గురించి తెలిసే ఉంటుంది. జుట్టు పెరుగుదల కోసం క్యారియర్ ఆయిల్ తో కలిపి విటమిన్-ఇ ఆయిల్ ను అప్లై చేసేవారు చాలామంది ఉన్నారు. అయితే కొబ్బరి నూనెలో విటమిన్-ఇ ఆయిల్ కలిపి రాయడం వల్ల మ్యాజిక్ జరుగుతుంది.

రెండు స్పూన్ల  కొబ్బరినూనెలో రెండు విటమిన్-ఇ టాబ్లెట్ల ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని చిన్న కంటైనర్ లో నిల్వ చేసుకోవాలి. కావాలంటే ఎక్కువ మోతాదులో తయారుచేసి నిల్వచేసుకోవచ్చు. మొదటగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత ముఖం మీద తడిలేకుండా తుడుచుకుని తయారుచేసుకున్న  ఆయిల్ ను నాలుగైదు చుక్కలు అరచేతిలో వేసుకుని బాగా రబ్ చేసి ముఖమంతా పట్టించుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని ఓ అయిదు నిమిషాల పాటు మెల్లిగా మసాజ్ చేయాలి. దీన్ని ఓ 20నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత ముఖం కడుక్కోవాలి. ఈ ఆయిల్ వల్ల మరింత మంచి ఫలితాలు కావాలంటే దీన్ని రాత్రి సమయంలో అప్లై చేయడం మంచిది. ఇలా చేస్తే ముఖ  చర్మంలోకి బాగా ఇంకిపోయి ముఖం మీద ముడుతలు తొలగించడంలో మరింత ఎఫెక్ట్ గా పనిచేస్తుంది. ఇలా ప్రతిరోజూ ఈ నూనెను అప్లై చేస్తుంటే ముఖ చర్మం చాలా తొందరగా యవ్వనంగా మారుతుంది. ఈ నూనె ఎక్కువ జిడ్డుగా ఉంటుంది కాబట్టి దీన్ని ఉదయం సమయంలో అప్లై చేయకపోవడం మంచిది.

విటమిన్ ఇ లో  అధిక మోతాదులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ కారణంగా ఇది   రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది.

 చాలామందికి ముఖంపై నల్లటి మచ్చలు కనిపిస్తుంటాయి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి కూడా. ఇలాంటి మచ్చలు హార్మోన్ల అసమతుల్యత   లేదా ఎండకు  ఎక్కువగా చర్మం ఎఫెక్ట్ కావడం వల్ల వస్తుంటాయి.  విటమిన్-సితో కలిపి  విటమిన్-ఇ ఆయిల్‌ని ఉపయోగించడం ద్వారా  ఈ మచ్చలు తొలగించుకోవడమే కాకుండా హైపర్‌పిగ్మెంటేషన్ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.

ఇప్పుడెలాగో వర్షాకాలం మొదలయ్యింది. వర్షం, చలికి సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారి పెదవులు చాలా తొందరగా పగులుతాయి. ఇలాంటి వారు పగిలిన పెదవులు, పెదవుల మూలల్లో విటమిన్-ఇ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల చర్మం రిపేర్ అయ్యి సాధారణ స్థితికి వస్తుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో విటమిన్-ఇ తో స్కిన్ కు మ్యాజిక్ చేయండి.

                                                *నిశ్శబ్ద.