వాళ్లిద్దరూ మళ్లీ కలిసి చేస్తున్నారా..?
on May 5, 2016
యంగ్ హీరో సందీప్ కిషన్ మంచి స్పీడు మీదున్నాడు. బ్లాక్ బస్టర్లు తెచ్చుకోకపోయినా, మంచి సినిమాలు చేస్తున్నాడనే పేరు సంపాదించుకుంటున్నాడు. లెటెస్ట్ గా సందీప్, నిత్యా జంటగా నటించిన ఒక అమ్మాయి తప్ప షూటింగ్ పూర్తి కావచ్చింది. దీని తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్లో నక్షత్రం అనే సినిమాను తెరకెక్కిస్తారనే ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో కాజల్ ను తీసుకుందామనుకున్నా, డేట్లు ఖాళీ లేని కారణంగా కాజల్ ఈ సినిమా నుంచి తప్పుకుందట. దీంతో సందీప్ తనతో రెండు సార్లు యాక్ట్ చేసిన రెజీనాను ఈ సినిమాకు ప్రిఫర్ చేస్తున్నాడట. ఇద్దరిపై వంశీ టెస్ట్ షూట్ కూడా చేశాడని సమాచారం. కేవలం సహనటులే కాక మంచి స్నేహితులు కూడా అయిన వీళ్లిద్దరూ గతంలో రొటీన్ లవ్ స్టోరీ, రారా కృష్ణయ్య సినిమాలకు కలిసి పనిచేశారు. నక్షత్రంలో కూడా కలిసి నటించి ఇద్దరి కాంబోలో ముచ్చటగా మూడో సినిమాను పూర్తి చేసేయాలనుకుంటున్నారు ఈ ఇద్దరూ. గ్లామర్, యాక్టింగ్ టాలెంట్ ఉన్నా, విచిత్రంగా రెజీనాకు అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఎలాగూ కృష్ణవంశీ హీరోయిన్లను అద్భుతంగా చూపిస్తాడని పేరుంది కాబట్టి, ఈ సినిమాతో నైనా, రెజీనా ఫేట్ మారుతుందని ఆశలు పెట్టుకుంది.