బాల-కృష్ణ కోసం సందీప్ పాట
on Feb 27, 2014
కథానాయకులు ఇతర సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఈ మధ్య ప్రతి సినిమాలో కనిపిస్తుంది. కానీ హీరో సందీప్ కిషన్ మాత్రం వేరొకరి సినిమా కోసం ఓ పాట కూడా పాడాడు. "ఇదేగా ఆశపడ్డావ్ బాల-కృష్ణ" చిత్రం కోసం సందీప్ తొలిసారి పాట పాడాడు. "నీ బెస్ట్ ఫ్రెండ్ కి మహేష్ లాంటి మొగుడు దొరక.." అంటూ సాగే సరదా సాంగ్ ను పాడాడు. విజయ్ సేతుపతి, స్వాతి జంటగా నటించిన ఈ చిత్రానికి గోకుల్ దర్శకుడు. ఈ పాట ప్రేమించి మోసం చేసిన అమ్మాయిని అల్లరిగా తిడుతూ పాడే పాట. సందీప్ చక్కగా పాడాడు అని నిర్మాతలు తెలిపారు.