బికినీ వెయ్యమన్నారని సినిమా వదులుకుంది..!
on Jun 6, 2016
వరస ప్రాజెక్ట్స్ తో కాజల్ కెరీర్ మళ్లీ పట్టాలెక్కేసిందని అనుకున్నారందరూ. అయితే సమ్మర్లో రెండు బ్యాక్ టు బ్యాక్ భారీ ఫ్లాపులను ఖాతాలో వేసుకుని మళ్లీ డేంజర్లో పడింది చందమామ. త్వరలో రిలీజ్ కానున్న హిందీ సినిమా దో లఫ్జోంకీ కహానీపైనే ఈ భామ ఆశలన్నీ ఉన్నాయి. అయితే ఆఫర్లు లేని ఇలాంటి సమయంలో, కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ తీస్తున్న సినిమాను వేరే హీరోయిన్ అయితే ఒప్పేసుకునేది కానీ, కాజల్ మాత్రం వదిలేసుకుంది. మూవీలో బికినీ వేయాల్సిన సీన్ ఉండటమే అందుక్కారణమట. దీంతో ఈ అవకాశం రెజీనాకు వెళ్లిపోయిందట. సందీప్ కిషన్ తో నక్షత్రం అనే సినిమాను ప్లాన్ చేశాడు కృష్ణవంశీ. ఆ సినిమాకు కాజల్ ను తీసుకున్నాడు. అయితే, సినిమాలో ఒక సీన్లో బికిన్ వేయాల్సి ఉంటుందని చెప్పడంతో, కాజల్ ఆ సీన్ తాను చేయలేనని ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చేసిందట. ఇక చేసేది లేక రెజీనా వైపు మొగ్గు చూపాడట కృష్ణవంశీ. ఆ విధంగా, కాజల్ అవకాశాన్ని రెజీనా కొట్టేసిందన్నమాట. ఒకరి లాస్ మరొకరి గెయిన్ అంటే ఇదే మరి.