సందీప్, కృష్ణవంశీల కొత్తసినిమా ' నక్షత్రం '..!
on Apr 27, 2016
యంగ్ హీరో సందీప్ కిషన్ మరో సినిమాకు సైన్ చేశాడు. ఇప్పటికే తెలుగులో ఒకమ్మాయి తప్ప, తమిళంలో మాయవన్, మానగరం సినిమాలు చేస్తున్న ఈ కుర్ర హీరో, తాజాగా తన కొత్త సినిమా కోసం తన ఫేవరెట్ డైరెక్టర్ కృష్ణవంశీతో టీం అప్ అయ్యాడు. గత కొద్ది రోజులుగా స్టోరీ డిస్కషన్స్ తో బిజీగా ఉన్న మూవీ టీం, ఈరోజే ముహూర్తం షాట్ చిత్రీకరించారు. కలలు నిజమౌతుంటాయి. నా ఫేవరెట్ డైరెక్టర్ కృష్ణవంశీగారితో సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజే ముహూర్తం షాట్ చిత్రీకరించాం. సినిమా పేరు నక్షత్రం అని ప్రకటించాడు హీరో సందీప్ కిషన్. కృష్ణవంశీకి బాలయ్య వందో సినిమా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా స్టార్ట్ చేయడం కోసం దిల్ రాజు నిర్మాతగా సమంతతో తీద్దామనుకున్న రుద్రాక్ష అనే ప్రాజెక్ట్ ను కూడా పక్కన పెట్టేశాడు. తర్వాత ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ కూడా కుదర్లేదు. దీంతో ఇప్పుడు సందీప్ కిషన్ తో నక్షత్రం అన్న సినిమాను స్టార్ట్ చేశాడు కృష్ణవంశీ. విభిన్నమైన టైటిల్ ను సెలక్ట్ చేసుకుని ఆసక్తి రేకెత్తించిన వంశీ సందీప్ కాంబినేషన్ సినిమాను ఎలా తెరకెక్కిస్తారో చూడాలి.
Also Read