సంజూబాబా ఆ హాలీవుడ్ యాక్టర్ లా చేస్తాడట..!
on May 5, 2016
వయసైపోయినా హీరోగానే ఫీలవుతుంటారు సినీహీరోలు. దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ, తాత వయసొచ్చేసినా ఇంకా హీరోయిన్లతో రొమాన్స్ చేయడం కామనే. కానీ తాను మాత్రం దీనికి వ్యతిరేకమంటున్నాడు సంజయ్ దత్. జైలు నుంచి విడుదలైన తర్వాత రెస్ట్ తీసుకుంటున్న ఖల్ నాయక్, తన సెకండ్ ఇన్నింగ్స్ లో కమర్షియల్ సినిమాలు, తాను ప్రేమించాల్సి వచ్చే కథలు చేయనని ఘంటాపథంగా చెబుతున్నాడు. కేవలం స్టోరీ బేస్డ్ సినిమాలు, తన వయసుకు తగ్గ సినిమాలే చేస్తానని, మంచి పాత్రల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందడమే తన లక్ష్యమంటున్నాడు. " ఇప్పుడు నాది ఐటెం సాంగ్స్ కు డ్యాన్స్ వేసే వయసు కాదు. జైలు జీవితంలో చాలా నేర్చుకున్నా. ప్రస్తుతం కుటుంబంతో ఆనందంగా ఉన్నా. తర్వాత నా బయోపిక్ తర్వాత, మున్నాభాయ్ సీక్వెల్, ఆ తర్వాత విధు వినోద్ చోప్రా సినిమా చేస్తున్నాను" అంటున్నాడు. మరీ ముఖ్యంగా హాలీవుడ్ లో వయసైన తర్వాత కూడా ప్రత్యేక పాత్రల్లో నటించే లియామ్ నీసన్ లా నటించడానికి ప్రయత్నిస్తానంటున్నాడు. మున్నాభాయ్ డిసిషన్ ను మిగిలిన భాషల్లో సీనియర్లు కూడా ఫాలో అయితే చాలా బాగుంటుంది మరి..