ముంబాయిలో మహేష్ చిందులు
on Nov 24, 2013
మహేష్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "1 నేనొక్కడినే". ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ నెల 28 నుండి ముంబాయిలో పాటను తెరకెక్కిస్తారు. కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 22 న ఆడియో విడుదల చేసి, సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.