బలుపు కోసం మాస్ రాజ వెయిటింగ్
on Jun 11, 2013
పూరి జగన్నాధ్ ఏ క్షణంలో ఇడియట్ సినిమా తీసాడో కానీ, అప్పటి నుండి రవితేజ మాత్రం అలాంటి సినిమాలే చేసుకుంటూ వస్తున్నాడు. ఏ సినిమా చూసినా కూడా అమ్మాయిల వెంటపడటం, వాళ్ళను ఏడిపించే కథలకే రవితేజ ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాడు. దీంతో జనాలు రవితేజ సినిమా అంటేనే బోర్ అనేలా తయారయ్యారు. అందుకే 'కిక్' చిత్రం తర్వాత రవితేజ నటించిన ఏ ఒక్క చిత్రం కూడా విజయం సాధించకపోగా... అట్టర్ ప్లాప్ అయ్యాయి.
'దొంగలముఠా, వీర, నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు, సారోచ్చారు' వంటి వరుస అట్టర్ ప్లాప్ చిత్రాల తర్వాత రవితేజ నటించిన తాజా చిత్రం 'బలుపు'. ఈ చిత్రాన్ని ఎలాగైనా విజయం సాధించేలా చేయాలనీ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ నుంచే ప్రచారం మొదలు పెట్టేసాడు. ఈ చిత్రంలో రవితేజ ఒక పాట కూడా పాడటం, ఆ పాటకు ఆడియో ఫంక్షన్ లో హీరోయిన్స్ తో కలిసి డాన్సులు కూడా చేసి సినిమాకి కాస్త క్రేజ్ వచ్చేలా తన ప్రయత్నం తాను చేసాడు.
మరి ఈ మాస్ రాజకి 'బలుపు'తో విజయం దక్కుతుందో లేక "ట్యూబ్ లైట్" లాగా ప్లాప్ అవుతుందో త్వరలోనే తెలియనుంది. మరో గమనిక... అసలే ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉన్న మనోడికి ఏ సినిమా ఆఫర్లు రాకపోతే.... తనే ఓ చిత్రాన్ని నిర్మిస్తూ, దర్శకత్వం కూడా చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం.