రియల్ స్టార్ కొత్త అవతారం
on Jun 11, 2013
రియల్ స్టార్ శ్రీహరి అంటే గుర్తొచ్చేది ఫైట్లు, డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్ లు... ఇవి మాత్రమే శ్రీహరిని రియల్ స్టార్ ని చేసాయి. అయితే ఇప్పుడు అల ఫైట్లు చేయలేకపోతున్న శ్రీహరి కామెడీ ట్రాక్ ఎక్కేసాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ, తన స్టైల్లో కామేడీలు కూడా చేస్తున్నప్పటికీ శ్రీహరికి ఏ స్టార్ కూడా కలిసి రావట్లే. సినిమా అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో, శ్రీహరి ఇపుడు నిర్మాత అవతారమెత్తాడు.
శ్రీహరి ముఖ్య పాత్రలో నటిస్తూ 'వీకెండ్ లవ్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా నాగు గవర అనే యువ జర్నలిస్టుని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని శ్రీహరి తన పుట్టిన రోజైనా ఆగష్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. మరి ఈ చిత్రం శ్రీహరి కెరీర్ కి ఎలాంటి మలుపునిస్తుందో త్వరలోనే తెలియనుంది.