అందాల సుందరికి బంపర్ ఆఫర్
on Jun 11, 2013
అతిలోక సుందరి అనగానే వెంటనే గుర్తొచ్చే హీరోయిన్ శ్రీదేవి. అలాంటి శ్రీదేవి చాలా కాలం సినిమాలకు దూరంగా ఉండి, ఇటివలే 'ఇంగ్లీష్ వింగ్లిష్' అనే చిత్రంలో నటించింది. తమ అభిమాన హీరోయిన్ మళ్ళీ అంత పెద్ద స్క్రీన్ మిద కనిపించేసరికి... సినిమా ఫుల్ కలెక్షన్స్ తో ఆడి, నిర్మాతకు లాభాలు వచ్చేలా చేసింది. ఈ చిత్రం తర్వాత మళ్ళీ కాస్త సైలెంట్ గా ఉన్న శ్రీదేవిని, ఒక రియాలిటి షో ద్వారా మళ్ళీ బుల్లితెర పైకి తిస్కోచ్చే ప్రయత్నాలు చేస్తుంది ప్రముఖ ఓ టి.వి. చానల్. ఈ షోలో ఒక్కో ఎపిసోడ్ కి 20 లక్షల చొప్పున శ్రీదేవికి ఇవ్వడానికి ఆ ఛానల్ వారు సిద్దంగా ఉన్నారని తెలిసింది. ఒకవేళ శ్రీదేవి ఈ ఆఫర్ వద్దంటే మరో 10 లక్షలు కూడా కలిపి, ఒక్కో ఎపిసోడ్ కి 30 లక్షల చొప్పున ఇవ్వడానికి కూడా వారు రెడీ గా ఉన్నట్లు తెలిసింది.
మరి ఇప్పటికే పలు తమిళ, హిందీ, ఇంగ్లీష్ చానల్స్ వారు శ్రీదేవిని సంప్రదించినప్పటికి, వాళ్ళందరికి కూడా నో చెప్పేసిందట, కానీ తెలుగులో మొదటి సారీ ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్ రావడంతో శ్రీదేవి కూడా తెలుగు బుల్లితెరపై కనిపించడానికి సిద్దంగానే ఉన్నట్లు సమాచారం.
మనలో మన మాట:... ఈ షో హిట్టయ్యిందో నిర్మాతకు, శ్రీదేవికి పండగ... లేదనుకో శ్రీదేవికి కోట్ల (డబ్బుల) వర్షం, నిర్మాత పరిస్థితి ... గోవింద గో...విందా.