వర్మ ఫ్లాపులకు కారణం అదేనా..?
on Apr 26, 2016
కాంట్రవర్సీలకు కేరాఫ్ గా ఉన్నప్పటికీ, వర్మను అభిమానించే వారు ఇంకా ఉన్నారంటే అందుక్కారణం డైరెక్టర్ గా వర్మ బ్రిలియన్స్. మరి ఇంత బ్రిలియంట్ డైరెక్టర్, ఎప్పుడూ కొత్తగా అవుటాఫ్ బాక్స్ ఆలోచించే వ్యక్తి ఫ్లాపుల మధ్య ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాడు..? ఎప్పుడో ఒకటి అరా తప్పితే, హిట్టు సినిమాలు ఎందుకు తీయలేకపోతున్నాడు..? వర్మ అభిమానుల్ని నిరంతం వేధిస్తూ ఉండే డౌట్స్ ఇవి. ఇవే ప్రశ్నలు వర్మ ముందుంచితే, చూసేవాడు చూస్తాడు, నచ్చని వాడు చూడడు లాంటి విచిత్రమైన సమాధానాలు చెబుతాడు తప్ప, సరైన ఆన్సర్ ఇవ్వడు. అందుకే వర్మను ఈ ప్రశ్న అడగడం కూడా అనవసరమే. అయితే, వర్మకు మాత్రం సడెన్ గా బల్బ్ వెలిగింది. తన సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయో తనకు తెలిసిందంటున్నాడు వర్మ గారు. ఇన్నాళ్లుగా తన పొగరు వల్లే, తీసిన చాలా సినిమాలు అడ్డంగా ఫ్లాప్ అయిపోయాయని, ఇకపై పొగరును, ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని మళ్లీ భారీ హిట్టు కొడతానంటూ మంగయ్య శపథం చేస్తున్నాడు. సాధారణంగా ఆయన కాళ్లు మీద నిలబడడు. మరి ఈ మాట మీద ఎంతకాలం ఉంటాడో చూద్దాం.