బిగ్ న్యూస్: ప్రభాస్‌ని డైరెక్ట్ చేయనున్న నాగ్ అశ్విన్!
on Feb 26, 2020
ఇది నిజంగా వెరీ బిగ్ న్యూస్. ప్రభాస్ హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించేందుకు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సన్నాహాలు చేస్తోంది. 'మహానటి' లాంటి జాతీయ అవార్డులు పొందిన చిత్రాన్ని రూపొందించిన్ నాగ్ అశ్విన్ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు. సి. అశ్వినీదత్ సమర్పించే ఈ చిత్రాన్ని స్వప్నాదత్, ప్రియాంకా దత్ కలిసి నిర్మించనున్నారు. వైజయంతీ మూవీస్‌ను అశ్వినీదత్ ప్రారంభించి 49 ఏళ్లు నిండి 50వ ఏట అడుగుపెడుతోంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక సెన్సేషనల్ మూవీని నిర్మించాలని అశ్వినీదత్, ఆయన కుమార్తెలు సంకల్పించారు. నాగ్ అశ్విన్ లాంటి అత్యంత ప్రతిభావంతుడైన దర్శకుడు వాళ్ల కుటుంబ సభ్యుడుగానే ఉన్నాడాయె. అతని దర్శకత్వంలోనే వాళ్లు 'మహానటి'ని నిర్మించారు. అతను చెప్పిన కథ ప్రభాస్‌ను బాగా ఇంప్రెస్ చేసింది, వెంటనే అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇది ఏ తరహా సినిమా, ఎప్పుడు మొదలు పెడతారనే విషయాలు త్వరలో వెల్లడికానున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో 'ఓ డియర్' మూవీని చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ లవ్ స్టోరీ 2021 వేసవిలో విడుదల కానున్నది.
Also Read