ప్రభాస్ కథే దేవరకొండ దగ్గరకొచ్చింది!
on May 12, 2020
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'దిల్' రాజు ఒక సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని మే మొదటి వారంలో తెలుగువన్ తెలిపింది. శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా మైత్రి మూవీ మేకర్స్ సంస్థకి చేయాలని విజయ్ దేవరకొండ అనుకోవడంతో... ఇంద్రగంటి సినిమా ఇటు దిల్ రాజు దగ్గరకొచ్చింది. పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ బదులిచ్చే క్రమంలో 'మీతో చేయబోయే అద్భుతం గురించి ఎదురు చూస్తున్నా' అని దర్శకుడు ఇంద్రగంటితో విజయ్ దేవరకొండ అనడంతో వీరిద్దరి కలయికలో సినిమా ఖాయమైందని అందరూ ఓ నిర్ణయానికి వచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే... పోలీస్ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుందట.
ప్రభాస్ హీరోగా ఈ సినిమా చేయాలని మోహనకృష్ణ ఇంద్రగంటి అనుకున్నారట. యంగ్ రెబల్ స్టార్ దగ్గరకు వెళ్లి కథ కూడా చెప్పారట. అప్పటికే 'బాహుబలి'కి ఐదేళ్లు, 'సాహో'కి రెండేళ్లు సమయం పట్టడంతో మరో భారీ బడ్జెట్ సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదని ప్రభాస్ సున్నితంగా తిరస్కరించారని ఫిలింనగర్ గుసగుస. అదే కథ విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చిందని సమాచారం. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో నాని సుధీర్ బాబు హీరోలుగా మోహన కృష్ణ ఇంద్రగంటి 'వి' సినిమా తెరకెక్కించారు. ఆ సమయంలో ఆయన దిల్ రాజుకు పోలీస్ కథ చెప్పడం, అది విజయ్ దేవరకొండకి అయితే సూటవుతుందని నిర్మాత అనుకోవడం, హీరోకి కూడా నచ్చడంతో ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ అయిందట.