ప్రభాస్ మరో రెండేళ్లు బందీ కావాల్సిందేనా?
on May 7, 2020
ప్రభాస్ కథానాయకుడిగా చిత్రాలు తెరకెక్కించాలనే దర్శకులు 'బాహుబలి' స్థాయిలోనే ఆలోచిస్తున్నారు. ప్రాంతీయ ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకునేలా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించే కథాంశాలతో సినిమాలు తీయాలనుకుంటున్నారు. దాంతో ఒక్కో సినిమాకు ప్రభాస్ కనీసం రెండు రెండేళ్లు కేటాయించాల్సి వస్తోంది. ప్రేక్షకుల ముందుకు రాలేక సినిమా షూటింగులో బందీ కావాల్సి వస్తోంది.
'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా సుప్రసిద్ధ నిర్మాణసంస్థ వైజయంతి మూవీస్ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కూడా రెండేళ్లు పట్టేలా కనపడుతోంది. 'మహానటి' తర్వాత నాగ్ అశ్విన్ ఇలాంటి కథ చెబుతాడోనని ఎదురుచూస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూసే కథలు ప్రభాస్ కోసం రాశాడనీ, అది విని ఆశ్చర్యపోయానని చిత్ర నిర్మాత అశ్వినీదత్ అన్నారు. ఈ ఏడాది అక్టోబరులో సినిమాను మొదలుపెట్టి, 2022 ఏప్రిల్ లోపు విడుదల చేస్తామని ఆయన తెలిపారు. నిర్మాత లెక్క ప్రకారమే సినిమాకు ఏడాదిన్నర పడుతోంది. అనుకున్న ప్రకారం షెడ్యూల్స్ కాకపోతే మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉంటుంది.
'బాహుబలి' తర్వాత 'సాహో' కోసం ఎంత టైమ్ కేటాయించాడో తెలిసిందే. 'సాహో' తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న ప్రేమకథా చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ కరోనా అడ్డుపడింది. ఇప్పుడు ఈ నాగ అశ్విన్ సినిమా కోసం కూడా ఆయన రెండేళ్లు బంది కావాల్సిందేనేమో!?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
