ప్రభాస్ అభిమానులకు నిరాశే
on Apr 29, 2020
'మిర్చి' విడుదల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు రెండేళ్లు నిరాశ తప్పలేదు. 'బాహుబలి' ఫస్ట్ పార్ట్ వచ్చేవరకు తమ అభిమాన హీరోను రెండేళ్లు వెండితెరపై చూసుకోలేకపోయామని నిరాశ పడ్డారు. తర్వాత మరో రెండేళ్లు 'బాహుబలి' సెకండ్ పార్ట్ వచ్చేవరకూ మళ్లీ నిరాశ పడ్డారు. ఆ తర్వాత అయినా సినిమాలు చేయడంలో ప్రభాస్ స్పీడు పెంచాడా? అంటే అదీ లేదు. 'సాహో' కోసం మరో రెండేళ్లు సమయం తీసుకున్నాడు. ప్రేక్షకులు, అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఆ సినిమా విఫలమైంది. దాంతో ప్రభాస్ స్పీడు పెంచాలని నిర్ణయించుకున్నాడు. 'సాహో' విడుదల తర్వాత కొంత విరామం తీసుకొని 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న ప్రేమకథా చిత్రం షూటింగ్ మొదలుపెట్టాడు. చకచకా చిత్రీకరణ చేయాలనుకున్నాడు. కానీ, కరోనా అడ్డు పడింది. ప్రస్తుతం మరో రెండు మూడు నెలల వరకు సినిమా షూటింగులు మొదలయ్యే పరిస్థితులు లేవు. అందువల్ల, ఈ ఏడాది సినిమా విడుదలయ్యే దారులు, అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్టే. అందువల్ల, మరోసారి ప్రభాస్ అభిమానులకు నిరాశ తప్పదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
