ప్రభాస్21... ఇంకా టైమ్ ఉంది!
on May 18, 2020
ప్రభాస్ కథానాయకుడిగా నటించేబోయే 21వ సినిమాకి ఇంకా టైమ్ ఉందని దర్శకుడు నాగ్ అశ్విన్ చెబుతున్నాడు. అతడు చెప్పేది షూటింగ్ స్టార్ట్ చేయడానికి కాదు. నటీనటులను ఎంపిక చేయడానికి. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక ప్రేమ కథ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తయిన తర్వాత అశ్విని దర్శకత్వంలో సోషియో ఫాంటసీ సినిమా స్టార్ట్ చేస్తారు. అయితే ఈ సినిమా అప్ డేట్స్ తెలుసుకోవడానికి ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడిపై సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
'అన్నా... స్క్రిప్ట్ కి క్యాస్టింగ్ అందరూ ఫిక్స్ అయిపోయారా? ఏదో ఒకటి రిప్లై ఇవ్వండి ప్లీజ్' అని ప్రభాస్ అభిమాని ట్విట్టర్ లో నాగ్ అశ్విన్ ని అడిగారు. ఆ ప్రశ్నకు దర్శకుడు సమాధానమిచ్చారు. "స్క్రిప్ట్, ఫ్రీ విజువలైజేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. కరోనా వల్ల కొన్ని డిలే అయ్యాయి. కానీ, స్క్రిప్ట్ కి ఎక్కువ టైమ్ పడుతుంది. కాస్టింగ్ ఐడియాస్ ఉన్నాయి కానీ ఎవరినీ ఫైనలైజ్ చేయలేదు. ఇంకా టైమ్ ఉంది" అని నాగ అశ్విన్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి 2022 ఏప్రిల్ కీ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
