ఇదే పవర్‌స్టార్ "పవర్"
on Jul 18, 2017
పది సంవత్సరాలు ఒక్క హిట్ లేకపోతే ఏ హీరో పరిస్థితైనా ఏంటి..? జనం, మీడియా, చివరికి పరిశ్రమ కూడా మరచిపోతుంది. కానీ పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మాత్రం ప్రత్యేకం..ఖుషీ నుంచి జల్సా మధ్యలో ఆయనకు ఒక్క హిట్టు కూడా లేదు. కానీ అంతకంతకూ జనాల్లో క్రేజ్ పెరిగిపోయింది..ఓపెనింగ్స్ అయితే చెప్పనవసరం లేదు. అలా హిట్స్ ప్లాప్స్‌తో సంబంధం లేకుండా దూసుకెళ్తున్నాడు పవన్.. సినిమాల రిజల్ట్స్‌తో పనిలేకుండా పవన్ సినిమా సెట్స్ మీద ఉందంటే దానికి బోలెడంత హైప్. పవర్ స్టార్ ప్లాప్ డైరెక్టర్‌తో సినిమా చేస్తేనే ఫుల్ క్రేజ్ ఉంటుంది..అలాంటిది త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్‌తో మూవీ చేస్తుంటే అది ప్రత్యేకంగా చెప్పాలా.. అందుకే పేరు కూడా పెట్టకుండా జరుగుతున్న త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ మూవీకి ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతోందట. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు దాదాపు 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ఫిలింనగర్ టాక్. ఈ రేంజ్ బిజినెస్ మహేశ్ స్పైడర్, ఎన్టీఆర్ జై లవ కుశల వల్ల కూడా కాదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఏది ఏమైనా పవన్ కున్నా స్టామినానే వేరబ్బా.
Also Read