అనుష్క సరసన ఎన్టీయార్ విలన్!
on Jul 23, 2016
పరభాషా హీరోలు తెలుగులో విలన్లుగా నటించడం అన్నది ఎప్పట్నుంచో నడుస్తున్న ట్రెండ్. అల్లు అర్జున్ "వరుడు" సినిమా కోసం తమిళ యంగ్ హీరో ఆర్య ప్రతినాయకుడిగా మారాడు. ఇటీవల ఆది పెనిశెట్టి కూడా "సరైనోడు" సినిమా కోసం పవర్ ఫుల్ విలన్ గా అవతారమెత్తాడు. వీరిద్దరి బాటలోనే మలయాళ యాక్షన్ హీరో ఉన్ని ముకుందన్ కూడా ఎన్టీయార్ "జనతా గ్యారేజ్" చిత్రంతో విలన్ గా పరిచయంకానున్నాడు. అయితే.. మిగతా వాళ్లలా విలన్ గానే కంటిన్యూ అవ్వాలనుకోవడం లేదట. అందుకే అనుష్క టైటిల్ పాత్రలో "పిల్ల జమీందార్" ఫేమ్ అశోక్ తెరకెక్కిస్తున్న "భాగమతి" చిత్రంలో ఉన్ని ముకుందన్ హీరోగా నటిస్తున్నాడట.
హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రంలో అనుష్క సరసన తొలుత చాలా మంది హీరోల పేర్లు వినిపించినప్పటికీ.. స్టార్ డమ్ కంటే పెర్ఫార్మెన్స్ కు ఎక్కువ స్కోప్ ఉండడంతో ఉన్ని ముకుందన్ ను ఎన్నుకొన్నట్లు తెలుస్తోంది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
