నాని వైఫ్‌కు ఆ డబ్బింగ్ నచ్చలేదు
on Oct 22, 2019
'ఓ క్లాసిక్ సినిమాను చెత్త డబ్బింగ్ తో ఎలా పాడు చేయవచ్చో చూడండి' అంటున్నారు నేచురల్ స్టార్ నాని వైఫ్ అంజనా యలవర్తి. రీసెంట్‌గా 'జెర్సీ' సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. వారం రోజుల్లో 26 మిలియన్ వ్యూస్ వచ్చాయి. రెండు కోట్ల అరవై లక్షల మంది సినిమా చూశారు. వారిలో నాని వైఫ్ కూడా ఒకరు. ఆమెకు హిందీలో వెర్షన్‌లో నానికి చెప్పిన డబ్బింగ్ నచ్చలేదు. 'ఏంటి ఆ డబ్బింగ్? అసలు ఏంటి? 26 మిలియన్ పీపుల్ ఒరిజినల్ సినిమా చూసి ఉంటే... ఇరిటేషన్ వస్తుంది' అని అంజనా యలవర్తి పేర్కొన్నారు.
'జెర్సీ' హిందీ డబ్బింగ్ వెర్షన్ ఉన్నట్టుండి యూట్యూబ్ లో విడుదల చేయడం వెనుక ఒక మతలబు ఉంది. షాహిద్ కపూర్ హీరోగా ఒరిజినల్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో హిందీలో సినిమాను రీమేక్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. దాంతో డబ్బింగ్ రైట్స్ కొనుక్కున్నవాళ్ళు యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. హిందీ ప్రేక్షకులు ఎగబడి సినిమా చూశారు. అదీ సంగతి.