బ్రహ్మోత్సవంలో రెండు పాటలు లేపేశారా..?
on May 5, 2016
బ్రహ్మోత్సవం సినిమాలో రెండు పాటలు లేపేశారా..? వీటితో పాటు కొన్ని సీన్లను కూడా తొలగించారా..? అవునంటున్నాయి సినిమా వర్గాలు. సినిమా నిడివి ఎక్కువ కావడం, పోస్ట్ ప్రొడక్షన్లో టైం లేకపోవడం లాంటి కారణాల కారణంగా ఈ డెసిషన్ తీసుకున్నారట. ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కించిన ఈ సినిమాలో 8 పాటల వరకూ ఉన్నాయని, కానీ వాటన్నింటినీ షూట్ చేసే టైం లేకపోవడం, మూవీ పోస్ట్ పోన్ మెంట్ గురించి మీడియాలో వార్తలు వస్తుండటంతో, ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న డేట్ కు సినిమాను రిలీజ్ చేయాలని మూవీ టీం ఫిక్సయ్యారట. డ్యూరేషన్ ను రెండున్నర గంటల కంటే తక్కువ ఉండేలా ట్రిమ్ చేశారని, తీసేసిన వాటిలో పాటలే కాక, సీన్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఫ్యామిలీ డ్రామా జానర్ కావడంతో, సినిమా తక్కువ నిడివి ఉంటేనే ఆడియన్స్ కూడా బోర్ ఫీలవ్వకుండా ఉంటారని మూవీ టీం ఒపీనియన్. గతంలో శ్రీకాంత్ అడ్డాల మహేష్ కాంబినేషన్లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు కూడా బ్రహ్మానందం నటించిన కంప్లీట్ ట్రాక్ ను తీసేశారు. దీంతో సినిమా కాస్త నిడివి తగ్గి, ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. కాగా సమ్మర్లో ఫ్యామిలీ సినిమా లేని లోటును తాము తీరుస్తామని బ్రహ్మోత్సవం టీం కాన్ఫిడెంట్ గా చెబుతోంది. ఇప్పటికే ఒక పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేసిన మూవీ టీం, మే 7న శిల్పకళావేదికలో ఆడియో వేడుకను నిర్వహించబోతోంది.