నితిన్ పేరు మార్చేసాడట...!
on Feb 24, 2014
హీరో నితిన్ కు సొంత బ్యానర్ ఉన్న విషయం అందరికి తెలిసిందే. "శ్రేష్ట్ మూవీస్" అనే పేరు మీద బ్యానర్ ఏర్పాటు చేసి, అందులో వరుసగా "ఇష్క్", "గుండెజారి గల్లంతయ్యిదే" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించారు. అయితే తాజాగా ఈ బ్యానర్ పేరును మార్చేసినట్లుగా నితిన్ తెలిపాడు. బ్యానర్ ను "శ్రావణ మూవీస్" అని మార్చేసినట్లుగా నితిన్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. నితిన్ త్వరలోనే సురేందర్ రెడ్డి శిష్యుడు శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఇదే బ్యానర్లో నిర్మిస్తున్నారు. మరి బ్యానర్ పేరు మార్చడం వల్ల నితిన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో త్వరలోనే తెలియనుంది.