టీజర్ రివ్యూ: జక్కన్న
on Jun 18, 2016
కామెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్‌కు కెరిర్లో చెప్పుకోదగ్గ సినిమా మర్యాద రామన్న ఒక్కటే. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఆ స్థాయి హిట్ రాకపోవడంతో హిట్టు మెట్టెక్కేందుకు సునీల్ తెగ ట్రై చేస్తున్నాడు. రీసెంట్గా వచ్చిన కృష్ణాష్టమి కూడా కలిసిరాకపోవడంతో చాలా గ్యాప్ తీసుకుని మంచి కథ కోసం వెయిట్ చేసి "జక్కన్న" ను ఫైనల్ చేశాడు.
వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్ సరసన మన్నారా చోప్రా నటిస్తోంది. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. 30 సెకన్ల ఈ టీజర్లో రెండు డైలాగ్స్ తప్ప ఎలాంటి మాటల్లేవ్...అంతా మ్యూజిక్‌తో నడిపించారు. కాకపోతే సునీల్ మార్క్ కామెడీ ఈ సినిమాలో తప్పక ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. టీజర్లో ఎక్కువ శాతం డ్యాన్స్ వేస్తూ కనిపించడంతో ఈ సినిమాలో సునీల్ డ్యాన్స్‌తో కట్టిపడేస్తాడని తెలుస్తోంది. హీరోయిన్ మన్నార్ చోప్రా బబ్లీ లుక్స్‌తో..మిగిలిన అందాలు కావాలంటే సినిమా వచ్చేదాకా ఆగాలంటోంది.