హ్యాపీ బర్త్డే టూ మిత్రవింద
on Jun 19, 2016
కలువల్లాంటి కళ్లతో..మత్తెక్కించే చూపులతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది పంజాబీ ముద్దు గుమ్మ కాజల్. తొలిచిత్రం లక్ష్మీకళ్యాణంతో తెలుగువారికి పరిచయమై..చందమామతో రాత మార్చుకుని మగధీరతో అగ్రకథానాయకగా మారింది కాజల్..ఇక వెనుదిరిగి చూడకుండా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్నింటా విజయకేతనం ఎగురవేసింది. ఇంత ఎత్తుకు ఎదగడం ఆమెకు ఉన్నట్లుండి జరిగింది కాదు. దాని వెనుక కఠోరమైన శ్రమ, పట్టుదల దాగి ఉన్నాయి. జయాన్ని..అపజయాన్ని ఒకేలా తీసుకోవడం వల్లనే తాను నిలకడగా రాణించగలుగుతున్నానని అంటారామె. హీరోయిన్గా సినిమాలు చేస్తూనే వివిధ బ్రాండ్లకు ఎండార్స్మెంట్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది కాజల్. ఇవాళ ఆమె పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఆమె ఎండార్స్ చేసిన బ్రాండ్స్ ఒకసారి చూద్దాం.
1. బ్రూ
2. ది చెన్నై షాపింగ్ మాల్
3. మలబార్ గోల్డ్
4. డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్
5. పానాసోనిక్
6. ఖజానా జ్యూయెలర్స్
7. చీరియో
8. కోల్గేట్