ఉంగరాల రాంబాబు ఫస్టాఫ్ రివ్యూ
on Sep 15, 2017
కమెడీయన్ నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్‌కు కాలం అచ్చి రావడం లేదు..మొదట్లో అందాల రాముడు, మర్యాద రామన్న, పూల రంగడు వంటి హిట్లతో హీరోగా దూసుకుపోతాడు అనుకున్న టైంలో వరుస ఫ్లాప్స్‌తో డీలా పడిపోయాడు. సినిమాలైతే చేస్తున్నాడు కానీ అవి బాక్సాఫీసు వద్ద తడబడుతూ మనోడీ కెరీర్‌ని డౌన్ ఫాల్‌లోకి నెట్టాయి. ఇలాంటి టైంలో ఉంగరాల రాంబాబుతో తన అదృష్టాన్నీ పరీక్షించుకుంటున్నాడు సునీల్. దీనికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తుండటం..పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన పరుచూరి కిరిటీ నిర్మాత కావడంతో ఈ మూవీపై క్రేజ్ తీసుకువచ్చింది. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో సినిమాను ముందే ప్రదర్శించడంతో టాక్ బయటకు వస్తోంది. డైరెక్టర్ క్రాంతి మాధవ్ కథని బాగా తెరకెక్కించారట..ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయట..హీరోయిన్ తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటన మూవీకి ప్లస్ పాయింట్. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తిగా ఆయన పలికే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయట. హీరోయిన్ మియా జార్జ్ అటు గ్లామర్‌తో పాటు ఫెర్‌ఫార్మెన్స్ పరంగాను అదరగొట్టేసిందట. ఈ చిత్రం సునీల్‌కి హిట్ ఇచ్చిందో లేదో తెలుసుకోవాలంటే ఫుల్ మూవీ రివ్యూ కోసం కొద్దిసేపు వెయిట్ చేయండి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
