సునీల్ స్టేట్మెంట్... డాక్టర్ల సూచన మేరకే...
on Jan 23, 2020
ప్రముఖ హాస్యనటుడు, కథానాయకుడు సునీల్ గురువారం ఉదయం గచ్చిబౌలిలోని ఒక ఆస్పత్రిలో చేరారు. దాంతో ఆయన ఆరోగ్యంపై పుకార్లు షికారు చేశాయి. సునీల్ కు ఏదో అయిందంటూ ప్రచారం జరిగింది. త్రోట్ ఇన్ఫెక్షన్, బాడీపెయిన్స్ వల్ల సునీల్ ఆసుపత్రిలో చేరారని, పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని వైద్యులు తెలిపినప్పటికీ గందరగోళ వాతావరణం తగ్గలేదు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ ఛానల్ ప్రతినిధితో సునీల్ మాట్లాడారు. తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. సునీల్ మాట్లాడుతూ... "నేను ఆరోగ్యంగా ఉన్నాను. సైనస్, ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స తీసుకోవడానికి ఆసుపత్రి కి వచ్చాను. డాక్టర్ల సూచన మేరకు అడ్మిట్ అయ్యాను. అంతే తప్ప పెద్ద ప్రమాదం ఏమీ లేదు" అని అన్నారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
