బైక్ మీద అల్లరి నరేష్, సునీల్ శ్రీశైలం వెళ్తున్నారు..!!
on Aug 23, 2018
అల్లరి నరేష్, సునీల్ ఇద్దరూ కామెడీకి పెట్టింది పేరు.. అలాంటిది వీరిద్దరూ కలిసి ఓ కామెడీ సినిమా చేస్తే థియేటర్లో నవ్వులే నవ్వులు.. త్వరలో నవ్వుల పువ్వులు పూయించటానికి అల్లరి నరేష్, సునీల్ 'సిల్లీఫెలోస్' సినిమాతో మన ముందుకి రాబోతున్నారు.. ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.. ఇప్పటికే అల్లరి నరేష్ తో 'సుడిగాడు' సినిమా చేసి కడుపుబ్బా నవ్వించిన భీమనేని.. ఈ సారి నరేష్, సునీల్ తో కలిసి 'సిల్లీఫెలోస్' అంటున్నారు.. మరి ఈ సినిమాతో ఇంకెంత నవ్విస్తారో చూడాలి.. త్వరలో విడుదలకు సిద్దమైన ఈ సినిమా మోషన్ టీజర్ ను ఈ రోజు విడుదల చేసారు.. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి విశేషస్పందన లభిస్తుంది.. ఈ టీజర్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌పై అల్లరి నరేష్ దూసుకుపోతుంటాడు.. వెనుక నరేష్ నడుముని పట్టుకుని వేలాడుతూ సునీల్ కనిపిస్తాడు.. ‘ఈ స్పీడులో వెళ్తే గంటలో శ్రీశైలం వెళ్లొచ్చు కదరా’ అని నరేష్ అడగగా.. ‘గంటెందుకురా అరగంటలోనే వెళ్లిపోతాం కైలాసానికి’ అని సునీల్ అంటాడు.. టీజర్ తో నవ్వించిన ఈ 'సిల్లీఫెలోస్' సినిమాతో ఇంకెంత నవ్విస్తారో చూడాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
