సునీల్ ఆశలన్నీ బాలయ్య మీదే...
on Jan 28, 2020
కమెడియన్‌గా సునీల్ సూపర్ సక్సెస్‌లు అందుకున్నాడు. హీరోగా టర్న్ అయ్యాక కొన్ని సక్సెస్‌లు వచ్చాయి. ఒక్కసారి ఫ్లాపులు వచ్చాక మళ్లీ తిరిగి కోలుకోవడం కష్టమైంది. హీరోగా హిట్లు కొట్టలేక... మళ్లీ కమెడియన్‌గా చేయలేక కొన్ని రోజులు ఇబ్బందిపడ్డాడు. చివరికి, కమెడియన్‌గా వచ్చాడు. కానీ, సక్సెస్‌లు రాలేదు. కమెడియన్‌గా సునీల్ టాప్ పొజిషన్‌కి రావడానికి కారణమైన అతడి ఆప్తమిత్రుడు, మాటల మాంత్రికుడు కూడా అతడికి సక్సెస్ ఇవ్వలేకపోయాడు. ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘అల వైకుంఠపురములో’ సినిమాల్లో సునీల్ నటించాడు. కానీ, ఆశించిన పేరు రాలేదు. ప్రయోగాలు చేయడానికి సునీల్ ముందుకొచ్చాడు. ‘డిస్కో రాజా’లో విలన్‌గా ట్రై చేశాడు. మేకవన్నె పులిలా మొదట్లో మొత్తగా ఉండి... క్లైమాక్స్‌లో విలనిజం చూపించాడు. సునీల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆడియన్స్‌కి షాకిచ్చింది. అతడి నటనకు పేరు వచ్చింది. కానీ, సినిమాకు సక్సెస్ రాలేదు. దాంతో బాలయ్య మీదే సునీల్ ఆశలన్నీ పెట్టుకున్నాడట.
‘సింహ’, ‘లెజెండ్’ వంటి సూపర్‌డూపర్ సక్సెస్‌ల తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అందులో శ్రీకాంత్ విలన్‌గా చేస్తున్నాడు. సునీల్‌కి కూడా విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఏదో దక్కిందట. నటుడిగా సునీల్ టాలెంట్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నవ్వించడమే కాదు, ఏడిపించగలడు కూడా. గతంలో కమెడియన్ క్యారెక్టర్స్‌తో పాటు ఎమోషనల్ క్యారెక్టర్స్ చేసి ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టించుకున్నాడు. బాలయ్య సినిమాతో విలన్‌గా ఎస్టాబ్లిష్ అవుతాడేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
