కుటుంబ కథాచిత్రాలంటే ఇవేనా...?
on Dec 4, 2013
నందమూరి తారకరామారావు కుటుంబం తర్వాత అంతటి పేరున్న పెద్ద నటుల్లో తర్వాత స్థానం అక్కినేని నాగేశ్వరరావు, తర్వాత ఘట్టమనేని కృష్ణలకు చెందింది. అయితే ప్రస్తుతం అక్కినేని కుటుంబం అంతా కలిసి నటిస్తున్న చిత్రం "మనం". అదే విధంగా మంచు వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి నటిస్తున్న చిత్రం "పాండవులు పాండవులు తుమ్మెదా". త్వరలోనే దగ్గుబాటి రామానాయుడు కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. దీనికి వెంకటేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. అయితే ప్రస్తుతం ఇదే జాబితాలోకి ఘట్టమనేని కుటుంబం కూడా చేరబోతుంది. నటుడు కృష్ణ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ చిత్రం రుపొందితే బాగుంటుందని తన మనసులోని మాటను కొడుకు మహేష్ తో చెప్పాడంట. దాంతో మహేష్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని తెలిసింది. ప్రస్తుతం "1", "ఆగడు" చిత్రాలతో బిజీగా ఉన్న మహేష్ ఈ చిత్రాల తర్వాత ఈ కుటుంబ కథా చిత్రం చేయనున్నాడు. మరి ఈ విధంగా కుటుంబ కథాచిత్రాల్లో ఇలా ఎవరి కుటుంబం వారే కలిసి నటిస్తే ఇక రచయితలందరూ కూడా హీరోల కుటుంబ సభ్యులతోనే సినిమాలు తీస్తారేమో మరి. త్వరలోనే కుటుంబ కథాచిత్రమంటే ఇదే అని ప్రేక్షకుల చేత అనిపించేలా ఉన్నారు వీళ్ళందరూ.