అవన్నీ పుకార్లేనట!
on Jul 3, 2016
"పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోయింది" అంటూ నిన్నంతా సోషల్ మీడియాలో ఒకటే కలకలం. పవన్ కళ్యాణ్ హీరోగా శరత్ మరార్ నిర్మిస్తున్న సినిమా ఆగిపోయిందని, ఎస్.జె.సూర్య వైదొలగడంతో.. అతడి స్థానంలో దర్శకుడిగా ఎంటర్ అయిన డాలీ స్క్రిప్ట్ పనులు మళ్ళీ మొదట్నుంచి మొదలుపెడుతున్నాడని, ఇదంతా నచ్చని పవన్ కళ్యాణ్.. ఈ ప్రోజెక్ట్ ను పక్కన పెట్టేసి త్రివిక్రమ్ తో సినిమా చేయడానికే మొగ్గు చూపాడని రకరకాల కథనాలు వెలువడ్డాయి, ఈ విషయమై నిన్న చిత్ర బృందం నుంచి ఎవరూ స్పండించకపోవడంతో.. అందరూ ఈ వార్త నిజమే అని నమ్మేశారు.
ఇలాగే వదిలేస్తే నిజంగానే సినిమా ఆగిపోయింది అనుకొంటారని భయపడ్డాడో లేక.. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు స్పందించాడో తెలియదు కానీ.. ఎట్టకేలక నిర్మాత శరత్ మరార్ "అవన్నీ వట్టి పుకార్లే" అని స్టేట్ మెంట్ ఇచ్చాడు. అలాగే వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవుతుందని కూడా చెప్పారు. సో, పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కంగారుపడకుండా ప్రశాంతంగా ఉండాలని మనవి!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
