నా తప్పేమీ లేదు: నయనతార
on Jul 3, 2016
"నయనతార కారణంగా "బాబు బంగారం" షూటింగ్ లేట్ అయ్యింది" అని కొన్నిరోజుల క్రితం వార్తలు మీరూ చదివే ఉంటారు. ఆ వార్త వ్యాపించిన వెంటనే నయనతార గురించి ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందించారు. ఎక్కువమంది నయనతారను టార్గెట్ చేసి తిట్టిపోశారు.
అయితే.. ఈ విషయంలో తన తప్పేమీ లేదు అని వివరణ ఇస్తోంది నయనతార. తోలుత నిర్మాతలు అడిగిన ప్రకారం తాను పద్ధతిగానే డేట్స్ ఇచ్చానని, కానీ.. ఇచ్చిన డేట్స్ కాకుండా మళ్ళీ "బాబు బంగారం" టీం మరిన్ని డేట్స్ అడగడంతో అప్పటికే వేరే సినిమాలకి డేట్స్ ఎడ్జెస్ట్ చేయడంతో.. "బాబు బంగారం" టీమ్ కి మరికొన్ని రోజుల డేట్స్ ఎడ్జెస్ట్ చేయడం కోసం టైమ్ పట్టింది. ఈలోపే నాపై బోలెడన్ని వార్తలు, ప్రచారం లోకి వచ్చేశాయ్ అంటూ అనవసర రాద్ధాంతం వల్ల కలిగిన ఇబ్బందికి కొద్దిగా బాధపడింది నాయన!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
