పోలీసుల ముందుకు కమల్ హాసన్?
on Feb 22, 2020
'భారతీయుడు 2' సెట్స్‌లో బుధవారం క్రేన్ కిందపడి ముగ్గురు మృతి చెందిన దుర్ఘటనలో కథానాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ ను పోలీసులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. బుధవారం రాత్రి ప్రమాదం జరిగిన వెంటనే క్రేన్ ఆపరేటర్ రాజన్ అదృశ్యం అయ్యాడు. పోలీసులు శుక్రవారం అతడిని అరెస్ట్ చేశారు. వృత్తిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ముగ్గురి మృతికి కారణమయ్యాడని రాజన్ మీద ఐపీసీ సెక్షన్స్ కింద కేసు పెట్టారు.
అయితే... ఘటన జరిగిన సమయంలో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కూడా ఘటనాస్థలంలో ఉన్నారు. అందుకని, వాళ్లిద్దరినీ పోలీసులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పోలీసుల ముందుకు వారు వెళ్లవలసి రావొచ్చని చెన్నై టాక్. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల సహాయం ప్రకటించిన కమల్ హాసన్, ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. దర్శకుడు శంకర్ కూడా ఆసుపత్రికి వెళ్లారు. దాంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయనే పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.
Also Read