బిగ్ బాస్ లో కమల్ హాసన్.. వాట్ ఏ సర్ ప్రైజ్..!!
on Aug 3, 2018
గత ఏడాది తెలుగు వారికి పరిచయమైన రియాలిటీ షో బిగ్ బాస్.. మొదటి సీజన్ లాగానే రెండో సీజన్ కూడా ఆసక్తిగా సాగుతుంది.. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన బిగ్ బాస్ 2 .. దానికి తగ్గట్టుగానే కంటెస్టెంట్స్ కి, ఆడియన్స్ కి అదిరిపోయే ట్విస్టులు ఇస్తుంది.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని తిరిగి తీసుకొచ్చి, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్ టీం.. మరో పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చింది.
అదే ఈరోజు బిగ్ బాస్ కి కమల్ హాసన్ గెస్ట్ గా రావడం.. బిగ్ బాస్ కి గెస్ట్ లు రావడం కామన్.. కానీ ఎందరో ఇన్స్పిరేషన్ గా తీసుకునే కమల్ లాంటి సీనియర్ స్టార్ హీరో రావడం విశేషమే.. కమల్ రాకతో కంటెస్టెంట్స్ నూతనోత్సాహం రావడం గ్యారెంటీ.. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది.. తమిళ్ బిగ్ బాస్ కి కమల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.. హోస్ట్ గా వ్యవహించే కమల్ ఇప్పుడు హౌస్ లో కంటెస్టెంట్స్ తో కలిసి ఉండటం ఆయనికి కొత్తగా ఉంటుంది.. చూసే ఆడియన్స్ కు, కంటెస్టెంట్స్ కు బోలెడంత కిక్ వస్తుంది.. చూద్దాం ముందు ముందు బిగ్ బాస్ ఇలాంటి సర్ ప్రైజ్ లు ఎన్ని ఇస్తుందో.