కమల్ హాసన్ భారతీయుడు కాదట..!!!
on Jul 20, 2018
1999 లో కమల్,దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'భారతీయుడు'. వయసు మళ్ళిన సేనాపతి పాత్రలో కమల్ అవినీతిపై చేసే పోరాటం బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులవర్షాన్ని కురిపించింది.అయితే ఈ సినిమాకి సీక్వెల్ చేస్తున్నామని శంకర్ ప్రకటించిన విషయం తెలిసిందే.దీనికి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించనున్నారు. కమల్ హాసన్ హీరోగా నటిస్తాడని కూడా వార్తలు వచ్చాయి.కమల్ కూడా ఈ సినిమా తన ఫ్యూచర్ ప్రాజెక్టులలో ఒకటని కొన్ని నెలల క్రితం చెప్పారు.
కానీ తాజా కోలీవుడ్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో కమల్ పూర్తి స్థాయి హీరో కాదట.కమల్ పాత్ర ఈ సినిమాలో ఉన్నప్పటికీ అవినీతిపై పోరాటం చేసేది మరో హీరోనట.ఆ పాత్రకు సరిగ్గా సూట్ అయ్యే ఒక హీరో కోసం శంకర్ ఇప్పటికే వెదకడం ప్రారంభించాడట. ప్రస్తుతం శంకర్ రజనీకాంత్ తో తెరకెక్కిస్తున్న 'రోబో 2.0' సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా విడుదల అనంతరం భారతీయుడు సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.భారతీయుడులో తన నటనకు ఫిధా అయిన అభిమానులకు భారతీయుడు సీక్వెల్ లో కమల్ చిన్నపాత్రకే పరిమితం అవుతాడు అనే విషయం నిరాశకు లోను చేయటం కాయం.మరి ఆ పాత్రకు తగ్గ హీరో ఎవరా అంటూ కోలీవుడ్ లో ఊహాగానాలు మొదలయ్యాయి.