శేఖర్ కమ్ముల కథకి అల్లు అర్జున్ ఫిదా
on Jun 18, 2018
శేఖర్ కమ్ముల.. మంచి కాఫీ లాంటి సినిమాలతో ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటాడు.. గతేడాది ఫిదా మూవీతో నిజంగానే ప్రేక్షకులను ఫిదా చేసాడు.. ఫిదా వచ్చి ఏడాది అవుతున్నా, శేఖర్ కమ్ముల తన తరువాతి సినిమా అనౌన్స్ చేయలేదు.. దీంతో ప్రేక్షకులు శేఖర్ కమ్ముల సినిమా ఎప్పుడొస్తుంది? ఎవరితో చేస్తాడంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అయితే ఇప్పుడొక ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తుంది.. రీసెంట్ గా శేఖర్ కమ్ముల అల్లు అర్జున్ ని కలిసి ఓ కథ వినిపించాడట.. అల్లు అర్జున్ కి ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.. ఇదే నిజమైతే, ఇప్పటివరకు స్టార్ హీరోలతో చేయకుండానే తన మూవీస్ తో ఫిదా చేసిన శేఖర్ కమ్ముల.. మొదటిసారి అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో చేయబోతున్నాడు.. ఇక ఈ మూవీతో శేఖర్ కమ్ముల ఏ రేంజ్ లో ఫిదా చేస్తాడో చూడాలి మరి.