సమంత కక్కముక్క మానేసి నెల
on Jan 6, 2020
అవును... ఇప్పుడు సమంత శాఖాహారి. అక్కినేని కోడలు 'వీగన్'గా మారారు. వీగన్స్ మాంసాహారం తినరు. అంటే... నాన్ వెజ్ అసలు ముట్టుకోరు. పూర్తిగా శాఖాహారమే తీసుకుంటారు. మొక్కల నుండి పండించిన కాయగూరలు మాత్రమే తింటారు. ఇంతకీ, సమంత కక్కముక్క మానేసి ఎన్ని రోజులైందో తెలుసా? నెల. ఓ 30 రోజుల నుండి ప్లాంట్ బేస్డ్ డైట్ ఫాలో అవుతున్నానని సమంత తెలిపారు. ఈ మార్పు ఎందుకనేది ఇంకా చెప్పలేదు. సమంత వంటి స్టార్ హీరోయిన్ 'వీగన్'గా మారడం పట్ల జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని చాలామంది నాన్ వెజ్ మానేస్తారని, ఆమె వల్ల ప్రజల్లో అవగాహన పెరుగుతుందని జంతు ప్రేమికులు ఆశిస్తున్నారు.
యాక్టింగ్ విషయానికి వస్తే.... ప్రస్తుతం సమంత 'ది ఫ్యామిలీ మాన్' వెబ్ సిరీస్ రెండో సీజన్ లో యాక్ట్ చేస్తున్నారు. తమిళ హిట్ '96' తెలుగు రీమేక్ షూటింగ్ పూర్తి చేశారు. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ తో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయనున్నారని టాక్.