సమంత మామూలు షాక్ ఇవ్వలేదుగా!
on May 7, 2020
ఇటీవల రాశీ ఖన్నాను 'తెలుగులో మీకు ఇష్టమైన కథానాయిక ఎవరు?' అని అడిగితే సమంత పేరు చెప్పారామె. క్యారెక్టర్ ఆర్టిస్ట్ హిమజ కూడా అదే సమాధానం చెప్పారు. కథానాయిక కావాలనుకునే కొత్త అమ్మాయిలకు సమంత స్ఫూర్తి అంటే అతిశయోక్తి కాదు. అటువంటి వారందరికీ సమంత పెద్ద షాక్ ఇచ్చారు.
తొలుత గ్లామర్ పాత్రలు చేసినా... ఒక స్థాయికి వచ్చిన తర్వాత నటనకు ఆస్కారమున్న పాత్రలు వైపు సమంత మొగ్గు చూపారు. 'రంగస్థలం', 'మహానటి', 'మజిలీ', 'ఓ బేబీ', 'జాను'... సినిమా సినిమాకి నటిగా మరో మెట్టు ఎక్కుతున్నారు. ప్రస్తుతం సమంత కథానాయికగా కాకుండా నటిగా గుర్తిస్తున్నారంతా! నటిగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత... 'నటనలో ఓనమాలు దిద్దుకున్నాను, నటనలో పాఠాలు వింటున్నాను' అంటే ఎవరికైనా షాకే కదా!
లాక్ డౌన్ వల్ల ఖాళీ సమయం ఎక్కువ దొరకడంతో సమంత ఆన్ లైన్ లో యాక్టింగ్ క్లాసులు వింటున్నారు. "మరింత మంచి నటిగా కాబోతున్నాను" అని ఆవిడ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఒకవేళ మంచి నటి అనిపించకపోతే ఆ పోస్ట్ తీసేస్తానని కామెంట్ కూడా యాడ్ చేశారు. అదీ సంగతి! సమంత యాక్టింగ్ క్లాసులు వింటున్నారని తెలిసి చాలా మంది షాక్ అయ్యారు.