ఫారిన్ బ్యూటీతో ఎన్టీఆర్ షూటింగ్
on Jan 6, 2020
ప్రజెంట్ ఫారిన్ బ్యూటీ ఒలీవియా మోరిస్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ షూటింగ్ చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఆవిడే. క్రిస్మస్ ముందువరకూ ఎన్టీఆర్‌తో యాక్షన్ సీన్స్ తీసిన దర్శక ధీరుడు రాజమౌళి, ఇప్పుడు యాక్షన్‌కి స్మాల్ బ్రేక్ ఇచ్చారు. లవ్ సీన్స్, కొన్ని కీ సీన్స్ షూటింగ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్, ఒలీవియా, ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఒలీవియా ఇంతకు ముందు కొన్ని రోజులు 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ చేశారు. కొంత విరామం తర్వాత మళ్ళీ షూటింగ్ చేస్తున్నారు.
క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్ బ్రేక్ తీసుకున్న 'ఆర్ఆర్ఆర్' టీమ్, కొత్త ఏడాదిలో ఫ్రెష్ షెడ్యూల్ స్టార్ట్ చేసింది. వేసవికి షూటింగ్ కంప్లీట్ చేయాలని దృఢ నిశ్చయంతో రాజమౌళి ఉన్నారట. ఈ ఏడాది జూలై నెలాఖరున సినిమాను విడుదల చేస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టు ప్లాన్ ప్రకారం షూటింగ్ చేస్తున్నారు. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన సీత పాత్రలో హిందీ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.