నాకు పెళ్లయిందని చైతూ నమ్మలేదు
on Mar 17, 2020
పెళ్లి తర్వాత కూడా సమంత క్రేజ్ తగ్గలేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడాదీ నిర్వహించే 'మోస్ట్ డిజైరబుల్ విమెన్' సర్వేలో ఈసారి ఆమె టాప్ ప్లేస్‌లో నిలిచారు. ఫస్ట్ టైమ్ సమంత ఈ టైటిల్ గెలిచారు. "పెళ్లైన మహిళ ఈ టైటిల్ నెగ్గడం గొప్ప విషయం. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడానికి వేసే పెద్ద అడుగు. మహిళను ఆరాధించడానికి పెళ్లితో సంబంధం లేదని తెలిసి ఆశ్చర్యపోయాను" అని ఆమె అన్నారు. భర్త అక్కినేని నాగచైతన్యకు ఈ విషయం చెప్తే నమ్మలేదట.
"నేను చైతూతో ఈ విషయం చెప్పినప్పుడు 'వాట్?' అన్నాడు. తర్వాత 'వావ్' అన్నాడు. కొన్ని నిమిషాల తర్వాత 'నిజంగానా? నీకు పెళ్లైంది కదా!' అన్నాడు. నేను ఆశ్చర్యపోయినట్టు తను కూడా ఆశ్చర్యపోయాడు" అని సమంత తెలిపారు. పెళ్లి చేసుకుంటప్పుడు కెరీర్ మీద ఎటువంటి ఆశలు లేకుండా చేసుకున్నానని ఆమె అన్నారు. "నాకంటే ముందు పెళ్లైన హీరోయిన్లు బ్రేక్ తీసుకుని వెళ్లిపోయారు. మళ్లీ సినిమాల్లోకి తిరిగి రాలేదు. నా విషయంలోనూ అలాగే జరుగుతుందని అనుకున్నా. అంతేకాని ఆ ట్రెండ్ మార్చాలని అనుకోలేదు. ఇలా జరిగింది. అదృష్టవశాత్తూ నా కెరీర్ మీద మ్యారేజ్ ఎఫెక్ట్ పడలేదు. ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేశారు" అని సమంత చెప్పారు.
నాగచైతన్య కాకుండా హాలీవుడ్ హీరో క్రిస్ హేమ్స్‌వర్త్ అంటే తనకు ఇష్టమని సమంత చెప్పారు. భర్తతో కలిసి డేట్‌కి వెళ్ళినప్పుడు తనకు తాను సెక్సీగా అనిపిస్తానని మురిసిపోయారు.
Also Read