లక్ష్మీ మంచు... రానా రూటులోకి సమంత
on Jan 21, 2020
రానా దగ్గుబాటి నటుడు మాత్రమే కాదు. టాక్ షో హోస్ట్ కూడా. ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలతో సెలబ్రిటీలను పిలిచి 'నంబర్ వన్ యారి' టాక్ షో చేశారు. లక్ష్మీ మంచు అయితే 'ప్రేమతో మీ లక్ష్మీ', 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' అని టాక్ షోలు, 'మేము సైతం' అని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చేశారు. వీళ్లిద్దరి రూటులోకి సమంత వస్తున్నట్టు సమాచారం. అక్కినేని కోడలి పిల్ల కూడా ఒక టాక్ షో చేయడానికి రెడీ అవుతున్నారట.
అసలు వివరాల్లోకి వెళితే... సమంత త్వరలో ఒక టాక్ షో చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. టాక్ షో ఎలా ఉండాలి? ఎటువంటి ప్రశ్నలు అడగాలి? ఇతర టాక్ షోలకు డిఫరెంట్ గా ఉండాలంటే ఏం చేయాలి? అని వర్క్ చేస్తున్నారట. ఆల్రెడీ షో చేయడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ షో ఎందులో టెలికాస్ట్ అవుతుందో చూడాలి. ఇక, సినిమాల విషయానికి వస్తే... శర్వానంద్ కి జంటగా సమంత నటించిన సినిమా 'జాను'. ఫిబ్రవరిలో విడుదల కానుంది. మంగళవారం ఒక పాటను విడుదల చేస్తున్నారు. అలాగే, 'ది ఫ్యామిలీ మాన్ 2' వెబ్ సిరీస్ షూటింగ్ ను ఆమె పూర్తి చేశారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
