సమంత, నయనతార.. మధ్యలో విజయ్ సేతుపతి
on Feb 14, 2020
ఒక ఒరలో రెండు కత్తులు, ఓ చూరి కింద ఇద్దరు మహిళలకు పడదని సామెత. అలాగే, ఓ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లను హ్యాండిల్ చేయడం కష్టమని ఇండస్ట్రీలో అంటుంటారు. స్టార్ హీరోయిన్లు కాదు... సూపర్ స్టార్ హీరోయిన్లు నయనతార, సమంతను హ్యాండిల్ చేసే బాధ్యతను తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ నెత్తిన వేసుకున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేయబోతున్నారు.
హీరో విజయ్ సేతుపతి, దర్శకుడు విఘ్నేష్ శివన్ ది హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబినేషన్ లో 'నానుమ్ రౌడీ దాన్' సినిమా వచ్చింది. అదే తెలుగులో 'నేనూ రౌడీనే' పేరుతో విడుదలైంది. అందులో విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న నయనతార హీరోయిన్. ఇప్పుడు సేమ్ ఇదే కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతోంది. కాకపోతే... ఇందులో ఇంకొకరు యాడ్ అయ్యారు. ఆమె సమంత. విజయ్ సేతుపతి హీరోగా, నయనతార, సమంత హీరోయిన్లుగా విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న సినిమా 'కత్తువకుల రెండు కాదల్'. తెలుగులో 'తలుపు (డోర్) వెనుక రెండు ప్రేమ కథలు' అని అర్థం అట.
ఇదోక ముక్కోణపు ప్రేమకథ. ప్రేక్షకులను ఆకర్షించేలా 'నయనతార vs సమంత' అని దర్శకుడు విఘ్నేష్ శివన్ మోషన్ పోస్టర్ విడుదల చేశాడు. vs అంటే విజయ్ సేతుపతి అన్నమాట. నయనతార.. సమంత మధ్యలో విజయ్ సేతుపతి ఏం చేస్తాడో?

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
