రాజమౌళికి మరో ఆలోచన లేదంట !
on Mar 25, 2014
ప్రముఖ దర్శకుడు రాజమౌళి త్వరలో అల్లు అర్జున్ తో ఓ యాక్షన్ చిత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గతకొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై రాజమౌళి "ప్రస్తుతం "బాహుబలి" సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు, ఈ సినిమా పూర్తయ్యేవరకు తదుపరి సినిమాల గురించి ఆలోచించట్లేదని తెలిపారు.
రాజమౌళి ప్రస్తుతం "బాహుబలి" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రభాస్, రానా, అనుష్క ముఖ్య ప్రధాన తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2015లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం "రేసుగుర్రం" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రం తర్వాత బన్నీ సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.