ఐస్‌క్రీం టైటిల్ ఎందుకు అంటే..
on Jul 7, 2014
రామ్ గోపాల్ వర్మ విలక్షణత, సంచలనాలకి మారుపేరు. శివ సినిమాతో దర్శకునిగా పరిచయమైన ఆయన సినిమాలో ప్రతీ విషయంలో తన మార్క్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన వాడే టెక్నాలజీ మొదలుకొని పాత్రల రూపకల్పన, చిత్రీకరణ అంతా విభిన్నంగా సాగుతుంది. ముఖ్యంగా ఆయన సినిమా పేర్లు చూస్తే దెయ్యం, రాత్రి, క్షణక్షణం, అంతం, గాయం, భూత్, గాయబ్, రక్త చరిత్రం, మనీ, జంగిల్ ఇలా వెరైటీగా వుంటాయి. థ్రిల్, సస్పెన్స్, భయం, లాంటి ఏదో అంశం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఆయన సినిమా టైటిల్స్ లో.
అలాంటి వెరైటీ డైరెక్టర్ రీసెంట్ చిత్రం పేరు ఐస్‌క్రీం అని అందరికీ తెలిసిందే. ట్రెయిలర్స్ లో సస్పెన్స్, థ్రిల్లర్ గా కనిపిస్తున్న ఈ చిత్రానికి ఐస్‌క్రీం అనే పేరు ఎందుకు పెట్టారో సినిమా చూస్తేనే తెలుస్తుందన్నారు ఆర్‌జీవి. ఈ సినిమా కథకు ఐస్‌క్రీంతో సంబంధం వుంటుందన్నారు. సినిమా టైటిల్ మాత్రమే కాదు, ఈ సినిమా టెక్నిషియన్ టైటిల్స్ కూడా మారనున్నాయట. టెక్నీషియన్స్ పని చేస్తున్న పరిధి పెరగటమే ఇందుకు కారణమని ఆయన అన్నారు.