పవన్ నిలువునా ముంచేశాడు
on Oct 27, 2014
పాపం... సంపత్‌నందిని చూస్తే జాలేస్తోంది సినీ జనాలకు. రచ్చతో హిట్ తరవాత ఎన్ని అవకాశాలొచ్చినా పక్కన పెట్టేసి పవన్ కల్యాణ్ కాంపౌండ్‌లో అడుగుపెట్టాడు. 'గబ్బర్ సింగ్ 2' సినిమాకి డైరెక్ట్ చేసే అవకాశం కూడా అందుకొన్నాడు. దాంతో సంపత్‌నంది జాతకం మారిపోయిందనుకొన్నారంతా. కానీ... జాతకం మారడం కాదు, మాడిపోయిందని ఆలస్యంగా అర్థమైంది. గబ్బర్ సింగ్ 2 స్ర్కిప్టు సంతప్‌నంది ఎప్పుడో రెడీ చేసేశాడు. కానీ.. దాంట్లో మార్పులూ చేర్పులూ అంటూ ఆ స్ర్కిప్టును కెలికేశాడు పవన్. ఇంపోజీషన్ ఇచ్చిన పిల్లాడిలా... ఎప్పటికప్పుడు స్ర్కిప్టును దిద్దుకొని వచ్చేవాడు సంపత్. దాంట్లో మళ్లీ వేలు పెట్టి కెలికేవాడుపవన్. అలా స్ర్కిప్టును పలు దఫాలు తిరగరాసేశాడు. అయినా పవన్‌కి ఏదో అసంతృప్తి. అసలు ఈ ప్రాజెక్టు వర్కవుట్ అవ్వదేమో అన్న భయం కూడా కలిగాయి.
ఇప్పుడు గబ్బర్ సింగ్ 2ని పూర్తిగా పక్కన పెట్టాలని పవన్ నిర్ణయించుకొన్నాడట. ఒకవేళ ఈ సినిమా మొదలెట్టినా, సంపత్ నంది స్థానంలో మరో దర్శకుడు రావడం ఖాయమని కూడా ఫిల్మ్‌నగర్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాంతో సంపత్ నంది నీరసపడిపోయాడు. ఇంతకాలం పవన్ కోసం ఆగితే.. పవన్ కోసమే సినిమాలు వదులుకొంటే, ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి చెప్మా...?? అంటూ దిగాలు పడిపోతున్నాడట. పవన్‌ని నమ్ముకొంటే నిలువునా ముంచేశాడని.. తెగ ఫీలైపోతున్నాడట. ''గబ్బర్ సింగ్ స్ర్కిప్టు మనకు వర్కవుట్ కాదులే.. మరో కథ రెడీ చేయ్.. అప్పుడు ఆలోచిద్దాం..'' అంటూ పవన్ కూడా ఊరడింపు మాటలు మాట్లాడుతున్నాడట. ఆ స్ర్కిప్టు కోసం ఇంకెన్నాళ్లు పవన్ వెంట తిరగాలో అని.. సైడ్ అయిపోవడానికే నిర్ణయించుకొన్నాడు సంపత్‌నంది. ఇప్పుడు రవితేజ కోసం ఓ కథ రెడీ చేసుకొంటున్నాడట. హమ్మయ్య.. ఇప్పటికైనా కళ్లు తెరిచాడు. శుభంభుయాత్..!