అటకెక్కిన నితిన్ నందినిల సినిమా
on May 1, 2014
నితిన్ హీరోగా దర్శకురాలు నందినీరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టును ఆపేశారు. ఈ విషయంపై నందినీ రెడ్డి మాట్లాడుతూ... "నితిన్‌తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాం. అంతా ఫైనలైజ్ అయ్యింది. కానీ రాష్ట్ర విభజన కారణంగా ఈ సినిమాను ఆపేయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా మొదలు పెడితే అనేక ట్యాక్స్ సమస్యలు వస్తాయని అర్థమైంది. అందుకే మేము చాన్స్ తీసుకోదలుచుకోలేదు. ఆ సమస్యలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి ఆలోచిస్తాం" అని చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీప్రముఖులు మాత్రం అలాంటిదేమీ లేదని అంటున్నారు. మరి నందినీ కేవలం ట్యాక్స్ సమస్యలు వస్తాయనే ఆపేసిందా లేక మరే ఇతర కారణమైన ఉందా అనే విషయం త్వరలోనే తెలియనుంది.