యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణతిల కళ్యాణం కమనీయం
on May 5, 2011
యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణతిల కళ్యాణం కమనీయంగా జరిగింది. వివరాల్లోకి వెళితే ప్రముఖ తెలుగు సినీ యువహీరో యంగ్ టైగర్ యన్ టి ఆర్ వివాహం మే 5 వ తేదీ రాత్రి 2.41 గంటలకు లక్ష్మీ సౌభాగ్యవతి కుమారి లక్ష్మీ ప్రణతితో, హైటెక్స్ లో అంగరంగ వైభవంగా, సాంప్రదాయ పద్ధతిలో సశాస్త్రీయంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన నార్నే శ్రీనివాసరావు ఏకైక కుమార్తె నార్నేలక్ష్మీ ప్రణతి అప్పటి నుండి నందమూరి లక్ష్మీ ప్రణతిగా మారింది. ఈ వివాహ వైభవాన్ని చెప్పటానికి వేయి నాలుకలు చాలవు.
ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచీ వచ్చిన వేలాదిగా తరలివచ్చిన అశేష నందమూరి అభిమానుల సమక్షంలో ఆహా....ఓహో.... అనుకునే రీతిలో ఘనంగా జరిగింది. ఇక ఈ పెళ్ళికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వరకూ అనేకమంది ప్రముఖ రాజకీయ నాయకులు, మెగాస్టార్ చిరంజీవి నుంచి యువరత్న నందమూరి బాలకృష్ణ, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, ప్రిన్స్ మహేష్ బాబు ఇలా అనేకమంది సినీ ప్రముఖులు విచ్చేశారు.