తిరుపతిలో యన్ టి ఆర్ దంపతులు
on May 6, 2011
తిరుపతిలో యన్ టి ఆర్ దంపతులు శ్రీవారిని దర్శంచుకున్నారు. వివరాల్లోకి వెళితే "మే" 5 వ తేదీ 2.41 గంటలకు, హైదరాబాద్ హైటెక్స్ లో, యంగ్ టైగర్ యన్ టి ఆర్ కీ, లక్ష్మీ ప్రణతికి అత్యంత వైభవంగా వివాహం జరిగిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. ఈ పెళ్ళికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వరకూ అనేకమంది ప్రముఖ రాజకీయ నాయకులు, మెగాస్టార్ చిరంజీవి నుంచి యువరత్న నందమూరి బాలకృష్ణ, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, ప్రిన్స్ మహేష్ బాబు ఇలా అనేకమంది సినీ ప్రముఖులు విచ్చేశారు.
నవదంపతులు పెళ్ళయిన వెంటనే పసుపు బట్టలమీదే శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం తెలుగువారి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి, యన్ టి ఆర్ దంపతులు "మే" ఆరవ తేదీ ఉదయం తిరుపతి చేరుకుని అక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని శ్రీవారి ఆశీర్వాదం పోంది తిరిగి సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు. తదనంతరం యన్ టి ఆర్ తమ దంపతుల హనీమూన్ కి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నారని వినికిడి.
రెండువారాల తర్వాత ఆయన తిరిగి తను నటిస్తున్న సినిమాల షూటింగుల్లో మళ్ళీ పాల్గొంటారు. అంటే "మే" నెలాఖరుకి కానీ యన్ టి ఆర్ తిరిగి షుటింగుల్లో పాల్గొనరు. హనీ మూన్ నుంచి తిరిగి రాగానే "కిక్" సురేంద్రరెడ్డి దర్శకత్వంలోని సినిమా షూటింగులో యన్ టి ఆర్ పాల్గొంటారు.