ప్రేమలో పడ్డ హన్సిక ... !
on Mar 13, 2013
లేలేత అందాలతో కుర్రకారుని గిలిగింతలు పెట్టే అందాల హన్సిక ఓ తమిళ హీరోపై మనస్సుపారేసుకుంది. ఆ అదృష్టవంతుడు మరెవరో కాదు... యంగ్ సూపర్ స్టార్ శింబు. ప్రస్తుతం శింబుతో కలిసి రెండు సినిమాల్లో నటిస్తోన్న బొద్దుగుమ్మ ఆ తమిళ తంబితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిందని కాలీవుడ్ కోడైకూస్తోంది. గతంలో శింబు తాను ప్రేమలో పడ్డానని, ఆమె తమిళమ్మాయి మాత్రం కాదని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇటీవలే ఈ కొత్త జంట హైదరాబాద్ లో కలిసి కాస్త సమయం కూడా గడిపారట. ఇవన్నీకలిపి చూసుకుంటే... అందరూ అనుకునే దానికన్నా.... వారి మధ్య బంధం మరింత ధృఢమైనదే కావచ్చునని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.