హాట్ టాపిక్: మాజీ లవర్‌తో హన్సిక రొమాన్స్
on Dec 24, 2019
కోలీవుడ్ మన్మథుడు శింబుతో హన్సిక కొన్నాళ్లు ప్రేమలో ఉన్నారు. తర్వాత విడిపోయారు. చాలామంది హీరోయిన్లతో శింబు ప్రేమ వ్యవహారాలు నడిపాడు. అతడికి లవ్, బ్రేకప్ చాలా కామన్. నిర్మాతలతో గొడవలు... కొన్ని పాటలపై ప్రజలు ఆగ్రహాలు వ్యక్తం చేయడం... శింబు జీవితంలో వివాదాలకు లోటు ఏమీ లేదు. వీటిని అతడు పెద్దగా లెక్క చేస్తున్నట్టు కనిపించడు.
ఏ హీరోయిన్‌తో ప్రేమలో ఉంటే... ఆమెతో శింబు ప్రైవేట్ టైమ్‌లో రొమాన్స్ చేస్తున్న ఫొటోలు లీక్ అవుతుంటాయి. ఈసారి మాజీ లవర్‌తో శింబు రొమాన్స్ చేస్తున్న స్టిల్ ఒకటి బయటకొచ్చింది. దీన్ని ఎవరు లీక్ చేయలేదు. తమిళ సినిమా 'మహా' టీమ్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది. ఎందుకంటే... అది 'మహా'లో స్టిల్. ఇప్పటివరకు శింబుతో బ్రేకప్ అయిన హీరోయిన్లు మళ్ళీ అతడితో నటించలేదు. హన్సిక మాత్రం నటించింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా 'మహా'లో శింబు ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాడు. సినిమాలో వీళ్లిద్దరి మధ్య రొమాంటిక్ బెడ్ సీన్లు ఉన్నట్టు స్టిల్ చూస్తుంటే తెలుస్తోంది. అందువల్ల, ఈ స్టిల్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. మాములుగా తన ప్రతి సినిమా స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసే హన్సిక, ఈ స్టిల్ షేర్ చేయకపోవడం గమనార్హం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
