Home

»

Latest News

త్వరలో పెళ్లిపీటలెక్కనున్న హన్సిక..?

Nov 21, 2016 2:03PM

దేశముదురు సినిమాతో సౌత్‌లోకి ఎంటరైంది ముంబై చిన్నది హన్సిక..క్యూట్ లుక్స్‌తో అప్పట్లో కుర్రకారును గిలిగింతలు పెట్టి వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్లింది. అయితే తెలుగులో ఛాన్స్‌లు తగ్గడంతో కోలీవుడ్‌ వైపు ఫోకస్ చేసింది..స్వతహాగా బొద్దుగా ఉండే వాళ్లని ఇష్టపడే తమిళ తంబీలు హన్సికను బాగా ఆదరించారు. చిన్న ఖుష్భూగా పిలుచుకోవడంతో పాటు ఏకంగా గుడి కూడా కట్టేశారు. కొన్నాళ్లు అక్కడ కూడా హన్సిక హవా బాగానే నడిచింది.

అయితే కొత్త భామలు ఎంట్రీ ఇవ్వడంతో కోలీవుడ్‌లో..మరి బొద్దుగా తయారవ్వడంతో టాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గిపోయాయి. ఇది గ్రహించిన ఆమె తల్లిదండ్రులు హన్సికకు పెళ్లి చేయాలని డిసైడయ్యారట. మొదట కొంతకాలం వెయిట్ చేద్దాం అనుకున్నప్పటికి రెండేళ్ల నుంచి వరుస పరాజయాలు ఎదుర్వడంతో సినిమాలకు ఇక పేకప్ చెప్పేయాలని హన్సిక పేరేంట్స్ అనుకున్నారంటూ కోలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే హన్సిక తల్లి మోనా మాటలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. తన కూతురు వయసు ఇంకా 24 సంవత్సరాలేనని, ఇప్పుడే పెళ్లి చేయాల్సిన అవసరం లేదని తేల్చిపారేశారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com