మాజీ లవర్‌తో హన్సిక బ్యూటీ!!
on Mar 6, 2019
మొదట తెలుగు సినిమాతో తెరకు పరిచయమైంది అందాల హన్సిక. ఆ తర్వాత కోలీవుడ్ లో అడుగుపెట్టి స్టార్ హీరోస్ తో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంటుంది. ఇక మరోసారి ఆసక్తికరమైన వార్తలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం హన్సిక తన 50 వచిత్రం గా నటిస్తోన్న`మహా `చిత్రం పూర్తి కావొస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఆ మధ్య కాంట్రవర్సీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి తాజా తెలిసింది. అదేమిటంటే...మహా సినిమాలో హన్సిక మాజీ లవర్ కోలీవుడ్ నటుడు శింబు ఓ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా హన్సిక సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇప్పటికే పోస్టర్ల వివాదంతో మంచి పబ్లిసటీ సంపాందంచిన ఈ చిత్రం ఇప్పుడు శింబు, హన్సిక మరోమారు కలిసి నటిస్తుండటంతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే ఈ జంట మరోసారి తెరపై కనువిందు చేయనుందన్నమాట.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
